Monday, January 6, 2025

పోలీస్ స్టేషన్‌లో మందు, చిందులు

- Advertisement -
- Advertisement -

రాంచీ: కొందరు పోలీసులు ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే మద్యం సేవించారు. ఆ తర్వాత డ్యాన్సులు కూడా చేశారు. హోలీ రోజున జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీస్ స్టేషన్‌లో మద్యం తాగి చిందులు వేసిన ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. జార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మహాగామ పోలీస్ స్టేషన్‌లో విధుల్లో ఉన్న పోలీసులు హోలీ వేడుక జరుపుకున్నారు. ఈ సందర్భంగా మద్యం సేవించారు. మ్యూజిక్‌కు అనుగుణంగా కొందరు పోలీసులు డ్యాన్సులు చేశారు. కాగా, ఒకరు తన మొబైల్‌లో రికార్డు చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

జార్ఖండ్ మాజీ సీఎం బాబు లాల్ మరాండీ ఈ వీడియో క్లిప్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సీఎం హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. పోలీస్ స్టేషన్‌లో మద్యం తాగి డ్యాన్సులు చేసిన ఐదుగురు పోలీసులను గొడ్డా ఎస్సీ నాథు సింగ్ మీనా సస్పెండ్ చేశారు. మరోవైపు సస్పెండ్ అయిన పోలీసులలో ఇద్దరు ఏఎస్‌ఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ బిపిన్ బిహారీ రాయ్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ రాధా కృష్ణ సింగ్, కానిస్టేబుల్స్ సత్యేంద్ర నారాయణ్ సింగ్, కృష్ణ కుమార్ సింగ్, ప్యారే మోహన్ సింగ్‌పై శాఖాపరమైన చర్యలు చేపట్టారు. ఎస్పీ కార్యాలయం ఈ మేరకు వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News