Monday, January 20, 2025

హైదరాబాద్‌కు చేరిన జార్ఖండ్ రాజకీయం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఝార్ఖండ్ రాజకీయం తెలంగాణకు చేరింది. కాంగ్రెస్ కూటమి సర్కార్‌ను కాపాడుకునేందుకు జెఎంఎం,కాంగ్రెస్, ఆర్‌జెడి ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్ తదనంతర పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు బిజెపి చిక్కకుండా జాగ్రత్తలు చేపట్టారు. గురువారం రావాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో శుక్రవారం చేరుకున్నారు. బేగంపేటకు చేరుకున్న ఎమ్మెల్యేలకు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. రాంచీ నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న 43 మంది ఎమ్మెల్యేలను అటు నుంచి నేరుగా శామీర్‌పేటలోని రెండు బస్సుల్లో లియోనియా రిసార్ట్‌కు తరలించారు.

ప్రతి నలుగురి ఎమ్మెల్యేలకు ఒక కేర్ టేకర్‌ను నియమించారు. వారితో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ వ్యవహారాలు, బిజెపి నాయకులు కుట్రలను ఎప్పటికప్పుడు వివరిస్తారు. జార్ఖండ్ రాష్ట్రం బిజెపి దక్కకుండా కాంగ్రెస్ కూటమి పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్లుతున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లు వెల్లడించారు. ఈనెల 5న ఝార్ఖండ్ అసెంబ్లీలో కొత్త ముఖ్యమంత్రి చంపయ్ సోరెన్ బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జేఎంఎం, కాంగ్రెస్ పార్టీ కూటమి అప్రమత్తమైంది. ఝార్ఖండ్ ఎమ్మెల్యేల బాధ్యతలను మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసిసి సెక్రటరీ సంపత్‌కుమార్‌కు అప్పగించింది. అసెంబ్లీ బలనిరూపణ వరకు ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. 5వ తేదీ ఉదయం 7 గంటలకు ప్రత్యేక విమానంలో జార్ఖండ్‌కు ఎమ్మెల్యేలను తరలించనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News