Monday, December 23, 2024

జాతీయ స్మారక చిహ్నంగా ఝార్ఖండ్ టెర్రకోట ఆలయం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఝార్ఖండ్ లోని గుమ్లా జిల్లాలో గల టెర్రకోట ఆలయాన్ని జాతీయ స్మారక చిహ్నంగా గుర్తించనున్నట్టు పార్లమెంట్ లో ప్రభుత్వం సోమవార ం వెల్లడించింది. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర సాంస్కృతిక మంత్రి జి. కిషన్ రెడ్డి లిఖిత పూర్వకంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ప్రాచీన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు దాదాపు 3697 వరకు కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్నాయని, ఈ జాబితాలో కొత్తగా ఝార్ఖండ్ లోని టెర్రకోట ఇటుకల ఆలయాన్ని చేర్చడానికి గుర్తించినట్టు మంత్రి తెలియజేశారు. ఝార్ఖండ్‌లో 13 ప్రాచీన చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు ఉన్నాయని, ఇవన్నీ జాతీయ ప్రాముఖ్యత కలిగినవిగా ప్రకటించడమైందని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News