హేమంత్ సోరెన్ అరెస్టు ఆయన స్థానంలో చంపై సోరెన్ ఎంపిక
రాంచీ: జార్ఖండ్‌లో బుధవారం గంటల వ్యవధిలో కీలక పరిణామాలు జరిగాయి. మనీలాండరింగ్ కేసులో రాష్ట్ర ముఖ్యమం త్రి, జార్ఖండ్ ముక్తిమోర్చా (జె ఎంఎం) కార్యనిర్వాహక అధ్యక్షులు హేమంత్ సోరెన్‌ను ఇడి విచారించడం, తరువాత భారీ పోలీసు బందోబస్తు నడుమ ఆ యనను కస్టడీలోకి తీసుకోవడం తో సిఎం పదవికి రాజీనామా చే శారు. గవర్నర్‌కు లేఖను పంపించారు. వెంటనే కొత్త సిఎంగా జెఎంఎం సీనియర్ నేత, రాష్ట్ర రవాణా మంత్రిఅయి న చంపై సోరెన్‌ను శాసససభాపక్ష నేతగా ఎంపిక చేసినట్లు రా ష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేశ్ ఠాకూర్ తెలిపారు.
ఈ నేపథ్యంలో ఆయన కొత్త సిఎంగా బాధ్యతలు తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగిం ది. సిఎం పదవికి రాజీనామా చే సిన కొద్ది నిమిషాలకే ఱెన్ను మనీలాండరింగ్ కేసు కు సంబంధించి దర్యాప్తు సంస్థ సాయం త్రం (ఇడి) కస్టడీలోకి తీసుకుంది. మరింత విచారణకు సమయం తీసుకుంది. ముందు అదుపులోకి తీసుకున్న తరువాత హేమంత్‌ను అరెస్టు చేస్తున్నట్లు ప్ర కటించి ఇడి కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఓ భూమి కుంభకోణానికి సంబంధించి పెద్ద ఎత్తున డబ్బులు చేతులుమారాయనే ఆరోపణపై ఇడి సోరెన్‌పై కేసు పెట్టింది. ఇడి సమన్లను పట్టించుకోకుండా సోరెన్ కొద్దిరోజులుగా విచారణకు రాకుండా ఉంటూ వచ్చారు. చివరికి బుధవారం విచారణకు అంగీకరించారు.
ఈ దశలో ఆయన వాంగ్మూలం తీసుకున్నారు. 600 కోట్ల రూపాయల లావాదేవీలపై కేసు సాగుతున్న దశలో సోరెన్ పార్టీ ఎమ్మెల్యేలతో కూటమి సభ్యులతో ఒక్కరోజు క్రితం చర్చలు జరిపారు. తన వారసుడి గురించి నిర్ణయం తీసుకున్న తరువాత ఇప్పుడు ఇడి విచారణకు హాజరైనట్లు వెల్లడైంది. ముందుగా సిఎంగా సోరెన్ భార్య కల్పనా సోరెన్‌ను నియమిస్తారని ప్రచారం జరిగింది. ఈ ఏడాది నవంబర్‌లోనే అసెంబ్లీ ఎన్నికలు, రెండు నెలల్లో లోక్‌సభ ఎన్నికల క్రమం లో ఇప్పుడు సీనియర్ మంత్రిని ఈ పదవిలోకి తీసుకువచ్చిందని వెల్లడైంది.
సోరెన్‌పై బిజెపి రాజకీయ కుట్ర : మంత్రి ఠాకూర్
జార్ఖండ్‌లో సోరెన్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు బిజెపి సాగిస్తోన్న పెద్ద కుట్ర ఇడి విచారణ అని జెఎంఎం నేతలు ఎదురుదాడికి దిగారు. తాత్కాలికంగా బిజెపి గెలుస్తుందేమో కానీ , తమ మెజార్టీ ప్రభుత్వం కొనసాగుతుందని, దీనిని ఏ మోడీ ఏమి చేయలేడని రాష్ట్ర మంత్రి మిథిలేష్ ఠాకూర్ తెలిపారు. జరుగుతున్న వాటిని ప్రజలు చూస్తున్నారు. జరిగేదేమిటనేది వారు జరిగేలా చేస్తారని వ్యాఖ్యానించారు.