రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన హై యాక్షన్ డ్రామా ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’. దీపావళి సందర్భంగా ఈ మూవీ నవంబర్ 10న రిలీజ్ అవుతుంది. వెర్సటైల్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో స్టోన్ బెంచ్ ఫిలింస్ బ్యాన్ప ఈ చిత్రాన్ని కార్తీకేయన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని మేకర్స్ తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్లో జరిగింది.
విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొని బిగ్ టికెట్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా.. విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ “జిగర్ తండ డబుల్ ఎక్స్ ట్రైలర్ అదిరిపోయింది. కార్తీక్ సుబ్బరాజ్ బ్బరాజ్ ఎలా ఉంటుందో మరోసారి ఈ ట్రైలర్‌తో మనకు చూపించాడు. ట్రైలర్ ఔట్ స్టాండింగ్‌గా ఉంది. మూవీ తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందనే గట్టి నమ్మకం ఉంది. లారెన్స్, ఎస్.జె.సూర్య వంటి టాలెంటెడ్ యాక్టర్స్ ఇందులో నటించారు.
నా కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ అయిన పెళ్లి కళ వచ్చేసిందే బాల..ను లారెన్స్ మాస్టరే కంపోజ్ చేశారు. తను కొరియోగ్రాఫర్ నుంచి బెస్ట్ యాక్టర్ రేంజ్‌కు చేరుకున్నారు. ఎస్‌జె సూర్య, నా స్నేహితుడు పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాను డైరెక్టర్‌గా మనకు పరిచయమే. తనొక అద్భుతమైన యాక్టర్. కార్తీక్ సుబ్బరాజ్ గురించి చెప్పాలంటే తనొక కల్ట్ డైరెక్టర్. జిగర్ తండ డబుల్ ఎక్స్ ట్రైలర్ చూడగానే ఆసక్తి కలిగించింది. తను నాకోసం త్వరలోనే ఓ స్క్రిప్ట్ చేస్తాడని అనుకుంటున్నాను. ఈనెల 10న జిగర్ తండ డబుల్ ఎక్స్ మూవీని థియేటర్లో చూసి బ్లాక్ బస్టర్ చేయాలి’ అని అన్నారు. రాఘవ లారెన్స్ మాట్లాడుతూ ‘ఈ సినిమా నవీన్ చంద్రగారు అద్భుతంగా నటించారు. నిర్మాత కార్తికేయన్ సంతానం భారీ బడ్జెట్‌తో ఈ సినిమా చేశారు. ఎస్.జె. సూర్య నట రాక్షసుడు. ఈ సినిమాలో ఆయన సైలెంట్‌గా చేసిన పెర్ఫామెన్స్ ఆడియెన్స్‌కు నచ్చుతుంది.
కార్తీక్ సుబ్బరాజ్‌తో ఈ సినిమాను చేయాల్సింది. మిస్ అయ్యింది. ఆయనతో పని చేయాలని నేనే ఆయనకు ఫోన్ చేశాను. జిగర్ తండ2 చేయాలని ఫోన్ చేసిన ప్రతీసారి చేద్దామని కార్తీక్ సుబ్బరాజ్ చెప్పేవారు. ఓరోజు నిర్మాత కార్తికేయన్ ఫోన్ చేసి సబ్జెక్ట్ రెడీ అయ్యిందని చెప్పారు. మేకప్ లేకుండానే డైరెక్టర్‌గా నన్ను నటింపచేశారు. ఇంతకుముందు రాఘవ లారెన్స్ నటించిన సినిమాలు వేరు.. ఈ సినిమాలో మరోలా ఉంటుంది. ఆ క్రెడిట్ కార్తీక్ సుబ్బరాజ్‌కే దక్కుతుంది. సంతోష్ నారాయణ అద్భుతమైన మ్యూజిక్ అందించారు’ అని తెలిపారు. ఎస్.జె.సూర్య మాట్లాడుతూ “ఈ దీపావళి సందర్భంగా జిగర్ తండ డబుల్ ఎక్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. కార్తీక్ సుబ్బరాజ్ అనే గొప్ప డైరెక్టర్ క్రియేషన్‌లో ఈ సినిమాను చేశాం. తన మేకింగ్‌లో ఓ యూనిక్ స్టైల్ ఉంటుంది. తన వల్ల ఎంతో మంది కొత్త డైరెక్టర్స్ ఇండస్ట్రీలోకి వచ్చారు.
11 ఏళ్లలో ఆయన చేసిన బెస్ట్ మూవీ జిగర్ తండ డబుల్ ఎక్స్. ఎంటర్టైన్మెంటతో పాటు మంచి కాన్సెప్ట్ కూడా ఉంది. లారెన్స్ మాస్టర్ ఇందులో మాస్ సైడ్‌తో పాటు పెర్ఫామెన్స్ సైడ్‌ను కొత్తగా చూపించారు. ఈ సినిమాలో పెద్ద డైలాగ్స్‌ను కూడా లుక్స్‌తో ఎలా చేయాలనే విషయాన్ని నేను నేర్చుకున్నాను. ఆ క్రెడిట్ కార్తీక్ సుబ్బరాజ్‌కే దక్కుతుంది’ అని అన్నారు డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ ‘ఈ సినిమా నాకెంతో స్పెషల్ మూవీ. నాలుగున్నరేళ్ల తర్వాత థియేటర్స్‌లోకి విడుదలవుతున్న సినిమా ఇది. ప్రేక్షకులు కచ్చితంగా ఈసినమాకు కనెక్ట్ అవుతారు. ఎస్.జె.సూర్య తెలుగు ఆడియెన్స్ కోసం ఆయనే డబ్బింగ్ చెప్పారు’ అని తెలిపారు. కార్యక్రమంలో నిర్మాత కార్తికేయన్ సంతానం, సంతోష్ నారాయణన్, డైరెక్టర్ శైలేష్ కొలను, నవీన్ చంద్ర పాల్గొన్నారు.