Friday, January 3, 2025

యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ‘జిగేల్ ‘

- Advertisement -
- Advertisement -

త్రిగుణ, మేఘా చౌదరి లీడ్ రోల్స్ లో రూపొందుతున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ జిగేల్ సినిమా. మల్లి యేలూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డా.వై.జగన్ మోహన్, నాగార్జున అల్లం టాప్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. త్రిగుణ కీ సెట్ ని పట్టుకొని ఇంటెన్స్‌గా చూస్తున్న ఫస్ట్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఈ చిత్రంలో షాయాజీ షిండే, పోసాని, రఘు బాబు, పృథ్వి ప్రముఖ పాత్రలలో నటిస్తున్నారు. సెప్టెంబర్‌లో సినిమాని విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News