Monday, January 27, 2025

పెళ్లి నుంచి లవర్‌తో కలిసి పారిపోతుండగా… ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: పెళ్లి వేడుక జరుగుతుండగా వధువు తన లవర్‌తో కలిసి బైక్‌పై పారిపోతుండగా ట్రక్‌ను ఢీకొట్టడంతో ముగ్గురు ఘటనా స్థలంలోనే చనిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మిర్జాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….జిగ్నా ప్రాంతానికి చెందిన రాణి, ప్రయాగ్‌రాజ్‌కు చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. రాణి, సదరు యువకుడికి ఆదివారం వివాహం జరగనుంది. రాణి గతంలో జిగ్నా ప్రాంతానికి చెందిన యువకుడితో ప్రేమలో పడింది.

Also Read: వ్యాపారం బాగుందా.. అంతా మీ దయ

పెళ్లి ఆదివారం జరుగుతుండడంతో రాణి లవర్, ఆమె కజిన్ బ్రదర్ అక్కడి నుంచి తప్పించాలని ప్లాన్ వేశారు. ప్లాన్‌లో భాగంగా రాణిని ఇంటి నుంచి ఆమెను బైక్‌పై లవర్, కజిన్ తీసుకెళ్తుండగా ట్రక్కును ఢీకొట్టారు. దీంతో ఘటనా స్థలంలోనే ముగ్గురు దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీస్ అధికారి పాండే అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News