Friday, January 10, 2025

బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడి ‘జిలేబి’ వచ్చేస్తోంది..

- Advertisement -
- Advertisement -

‘నువ్వే కావాలి’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’, ‘మన్మధుడు’ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలని అందించిన సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కె.విజయభాస్కర్ చాలా విరామం తర్వాత చేస్తున్న యూత్‌ఫుల్ ఫన్ అండ్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్ ’జిలేబి’. ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్‌ఆర్కే ఆర్ట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజు అశ్రాని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

శ్రీకమల్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. ఈనెల 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ డేట్ పోస్టర్‌లో శ్రీకమల్, శివాని దేన్నో చాటుగా చూడటం ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Also Read: ‘బ్రో’ ఎంతో మందిని కదిలిస్తుంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News