విశాఖపట్నంలోని మధురవాడ స్వయంకృషి నగర్‌లో ప్రేమాన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తల్లి, కుమారైపై కత్తితో దాడి చేశాడు. తల్లి లక్ష్మీస్పాట్‌లోనే చనిపోగా, కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ యువకుడు చాలా కాలంగా ప్రేమపేరుతో ఆమె వెంట తిరుగుతున్నాడు. పెళ్లి చేసుకునేందుకు నిరాకరించడంతోనే ఈ దారుణానికి ఒడిగట్టా డని తెలుస్తోంది. పోలీసులు విచారణ చేస్తున్నారు. గంటల వ్యవధిలోనే విశాఖ పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. అతన్ని రహస్యంగా విచారిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నవీన్ అనే వ్యక్తిగా గుర్తించారు. బాధితురాలిది కూడా శ్రీకాకుళం జిల్లాయే. విశాఖపట్నంలో డిగ్రీ చదువుతోంది. కొంతకాలంగా ఓ యువకుడు ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అతని ప్రేమను తిరస్కరించింది.
దీంతో కక్ష పెంచుకున్న యువకుడు బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆమె ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి తల్లి నక్కా లక్ష్మి (43) ఘటనా స్థలంలోనే మృతి చెందింది. యువతి తీవ్రగాయాలతో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తచం చేశారు. యువతికి మెరుగైన వైద్యం అందివ్వాలని సూచించారు. నిందితుడికి కఠిన శిక్ష విధించే దిశగా విచారణ పూర్తి చేయాలని సూచించారు. మధురవాడ ప్రేమోన్మాది ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చీతో ఫోన్‌లో మాట్లాడారు. బాధితురాలు ఆరోగ్య పరిస్థితిపై హోంమంత్రి ఆరా తీశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రేమోన్మాదిని త్వరగా గాలించి పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. బాధితురాలి తల్లి లక్ష్మి మృతిపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.