- Advertisement -
అభయారణ్యానికి కొత్తపేరు
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత వన్యప్రాణి అభయారణ్యం జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ పేరు మారనుంది. దీనికి రామ్‌గంగా నేషనల్ పార్క్‌గా నామకరణం చేయనున్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ వ్యవహారాల సహాయ మంత్రి అశ్వనీ కుమార్ చౌబే ఇటీవలే ఈ పార్క్‌ను సందర్శించి వెళ్లారు. ఈ క్రమంలో పేరు మార్పు అంశాన్ని తమకు తెలియచేశారని ఈ పార్క్ డైరెక్టర్ రాహుల్ బుధవారం విలేకరులకు తెలిపారు. సందర్శకుల పుస్తకంలో కేంద్ర మంత్రి ఈ స్థలం పేరును రామ్‌గంగా నేషనల్ పార్క్‌గా పేర్కొంటూ సంతకం కూడా చేశారు. పేరు మార్పిడి గురించి అధికారులతో చర్చించినట్లు డైరెక్టర్ తెలిపారు.
- Advertisement -