Wednesday, January 22, 2025

త్వరలో డిరైవేటివ్ మార్కెట్ లోకి  జియోఫిన్, జోమాటో !!

- Advertisement -
- Advertisement -

ముంబై: డిరైవేటివ్స్ మార్కెట్ లో ప్రవేశించే, బయటికి వెళ్లే  కంపెనీల అర్హతలను ‘సెబీ’ సమయాసమయాలలో (టైమ్ టు టైమ్) ఆమోదిస్తుంటుంది. ఈ లెక్కన నిఫ్టీ 50 లోకి జియో ఫైనాన్సియల్ సర్వీసెస్, జోమాటో చేరే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

‘‘ఒకవేళ ఇలా అనుకున్న ప్రకారం జరిగితే…ఆగస్టు మూడో వారం కల్లా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సెగ్మంట్ లోకి ఈ రెండు కంపెనీలు చేరిపోతాయి. ఒకవేళ ఆ రెండు కంపెనీలు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్ లో ఆగస్టు 24 కన్నా ముందే చేరితే అవి 466 మిలియన్ డాలర్లు, 491 మిలియన్ డాలర్లను పాసివ్ ఇన్ ఫ్లోస్ (నిధుల ప్రవాహంగా) పొందవచ్చు. ఆ తర్వాత సెప్టెంబర్ లో జరిగే సమీక్షలో వాటికి నిఫ్టీ 50లో చేరే  హై ఛాన్స్ ఉండనున్నది’’ అని నువామా ఆల్టర్నేటివ్ అండ్ క్వాన్టిటేటివ్ రీసెర్చ్ పేర్కొంది.

నిఫ్టీ 50లో ఎల్ టిఐమైండ్ ట్రీ, డివీస్ ల్యాబ్స్ స్థానంలో ట్రెంట్ లిమిటెడ్, భారత్ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్) చేరనున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News