Friday, December 27, 2024

రూ.15 వేలకే జియో ల్యాప్‌టాప్

- Advertisement -
- Advertisement -

Jio laptop for Rs.15 thousand

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో 4జి సపోర్ట్‌తో తక్కువ ధర ల్యాప్‌టాప్‌ను విడుదల చేయబోతోంది. దీని ధర కేవలం రూ.15,000 ఉండనుంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని కంపెనీ జియోబుక్ కోసం క్వాల్కామ్, మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, క్వాల్‌కామ్ కంపెనీ జియో ల్యాప్‌టాప్‌ల కోసం ఆర్మ్ లిమిటెడ్ టెక్నాలజీతో తయారు చేసిన చిప్‌సెట్‌ను అందుబాటులోకి తేనుంది. అలాగే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మేకర్ మైక్రోసాఫ్ట్ యాప్ సపోర్ట్‌ను అందిస్తుంది. చౌకైన 4జి జియోఫోన్ తరహాలో కంపెనీ ఈ ల్యాప్‌టాప్‌ను విడుదల చేయనుంది. టాబ్లెట్‌కు ప్రత్యామ్నాయంగా జియో ఈ ల్యాప్‌టాప్‌ను అందించనుంది. అయితే ఈ ల్యాప్‌టాప్‌పై జియో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. రిలయన్స్ జియోకు భారతదేశంలో 42 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. జియో గూగుల్‌తో కలిసి త్వరలో 5జి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News