Wednesday, January 22, 2025

త్వరలో స్టాక్ మార్కెట్లలో జియో లిస్టింగ్?

- Advertisement -
- Advertisement -

ముంబై : జియో త్వరలో స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కావడానికి సిద్ధమవుతున్నది. జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ పేరుతో ఐపీఓకు వెళ్లనున్నది. అందుకోసం ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. వ్యవహారాల సంస్థ రిలయన్స్ స్ట్రాటర్జిక్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను రిలయన్స్ డీ మెర్జర్ చేసింది. డీమెర్జర్ తర్వాత రిలయన్స్.. జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ పేరిట స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కోసం ఐపీఓకు వెళనున్నట్లు తెలుస్తున్నది.

ఈనెల 20న రిలయన్స్ ఫైనాన్సియల్ సర్వీసెస్ అలియాస్ జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ డీమెర్జర్ ప్రక్రియ పూర్తవుతుందని రిలయన్స్ శనివారం ప్రకటించడమే దీనికి కారణమని తెలుస్తున్నది. రిలయన్స్‌లో రిలయన్స్ స్ట్రాటర్జిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ డీమెర్జర్కు గత నెలలో రెగ్యులేటరీ అప్రూవల్ కూడా లభించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో రిలయన్స్ స్ట్రాటర్జిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ డీ మెర్జర్ తేదీ ఖరారు చేసింది. మెక్ లారెన్స్ స్ట్రాటర్జిక్ వెంచర్స్‌కు చెందిన హితేష్ సెథియాను మూడేండ్ల పాటు రిలయన్స్ స్ట్రాటర్జిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ అలియాస్ జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ సీఈఓ, ఎండీగా కూడా నియమించింది.

ఇదే కంపెనీలో ముకేశ్ అంబానీ గారాల పట్టి ఈషా అంబానీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ నియామకాలను ఆర్బీఐ నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. స్ట్రాటర్జిక్ ఇన్వెస్ట్‌మెంట్స్ డీ మెర్జర్ ద్వారా 36 లక్షల వాటాదారుల స్టాక్ విలువ అన్ లాక్ అవుతుంది. ఇందులో భాగంగా జియో ఫైనాన్సియల్లో ఒక షేర్.. రిలయన్స్ వాటాదారులకు లభిస్తుంది. మూడు నెలలుగా రిలయన్స్ షేర్ 13 శాతం పెరిగి శుక్రవారం స్వల్పంగా తగ్గినా రూ.2635.45 వద్ద స్థిర పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News