Sunday, December 22, 2024

మరో కొత్త ఫోన్ ను తీసుకొచ్చిన జియో.. ధర ఎంతంటే?

- Advertisement -
- Advertisement -

జియో నుంచి మరో కొత్త ఫోన్‌ విడుదలైంది. జియో భారత్‌ జే1 పేరుతొ 4జీ లెవల్ ఫీచర్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. జియో టీవీ, జియో సినిమా, జియో పే వంటి ప్రీ- ఇన్‌స్టాల్డ్‌ యాప్స్‌తో ఈ ఫోన్‌ వస్తోంది. జియో తక్కువ ధరలో అందించే జియో భారత్‌ ప్రత్యేక ప్రీపెయిడ్‌ ప్లాన్లతో దీన్ని రీఛార్జి చేసుకోవచ్చు.

ఈ కొత్త ఫోన్‌ ధరను రూ.1799గా నిర్ణయించారు. అమెజాన్‌లో దీన్ని కొనుగోలు చేయొచ్చు.  2,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 3.5 ఎంఎం జాక్‌ ఉంది. క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేసేందుకు డిజిటల్‌ కెమెరా యూనిట్‌ను ఇచ్చారు. 2.8 అంగుళాల డిస్‌ప్లే అమర్చారు. ఫిజికల్‌ కీబోర్డుతో వస్తున్న ఈ ఫోన్‌.. థ్రెడ్స్‌ఎక్స్‌ ఆర్‌టీఓఎస్‌తో పనిచేస్తుంది. 0.13జీబీ స్టోరేజీ ఉంది. ఎస్‌డీ కార్డుతో 128జీబీ వరకు పెంచుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News