ముంబై: ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో స్మార్ట్‌ఫోన్‌ను ముకేశ్ అంబానీ ప్రకటించారు. దీనికి జియోఫోన్ నెక్ట్స్ అనే పేరు పెట్టారు. ఈ ఫోన్ వచ్చే వినాయక చవితి అంటే సెప్టెంబర్ 10 నుంచి మార్కెట్‌లోకి రానుందని అంబానీ వెల్లడించారు. ఇది ఆండ్రాయిడ్ స్పెషల్ వెర్షన్‌పై పని చేయనుంది. తొలిసారి పూర్తి ఫీచర్లతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. వరుసగా రెండో ఏడాది కూడా వర్చువల్‌గానే జరిగిన ఏజీఎంలో ముకేశ్ ఈ ఫోన్ గురించి ప్రస్తావించారు. గూగుల్, జియో టీమ్స్ కలిసి నిజంగానే ఓ బ్రేక్‌త్రూ స్మార్ట్‌ఫోన్ అయిన జియోఫోన్ నెక్ట్స్‌ను డెవలప్ చేశాయి అని అంబానీ చెప్పారు. గూగుల్, జియో అందించే అన్ని అప్లికేషన్లను ఇది సపోర్ట్ చేస్తుందని అన్నారు. ఈ ఫోన్ కోసం ఆప్టిమైజ్ చేసిన ఓ ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ వెర్షన్‌ను తమ టీమ్ తయారు చేసిందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెప్పారు. ఇది కేవలం ఇండియన్ యూజర్ల కోసం అందులోనూ తొలిసారి స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్న వారి కోసం రూపొందించినట్లు పిచాయ్ తెలిపారు.
జియోఫోన్ నెక్ట్స్ ఫీచర్స్..
వాయిస్ అసిస్టెంట్
ఆటోమెటిక్ రీడ్-అలౌడ్ ఆఫ్ స్ర్కీన్ టెక్స్ట్
లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్
రియాల్టీ ఫిల్టర్స్ తో స్మార్ట్ కెమెరా