Monday, November 18, 2024

దీపావళికల్లా జియోఫోన్ నెక్ట్స్ విడుదల

- Advertisement -
- Advertisement -

Jio smartphone Next

న్యూఢిల్లీ: జియో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ ‘జియోఫోన్ నెక్ట్స్’ దీపావళి నాటికి మార్కెట్‌లోకి విడుదల కానున్నదని సమాచారం. ఇది 7 ప్రత్యేకతలు(ఫీచర్స్) కలిగి ఉంటుంది. ప్రధానంగా ‘ప్రగతి’ ఆపరేటింగ్ సిస్టంతో రానున్నది. ఈ ప్రగతి ఆపరేటింగ్ సిస్టంను జియో, గూగుల్ కలిసి రూపొందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఖ్వాల్‌కామ్ మొబైల్ ప్రాసెసర్ కలిగి ఉంటుంది. అయితే ఏ మోడల్ చిప్‌సెట్‌తో దీనిని తయారు చేస్తున్నారన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఈ ప్రాసెసర్ గణనీయంగా పనిచేయగలదని మాత్రం తెలుస్తుంది. ఇది ఎంతో మంది ఎదురుచూస్తున్న 4జి స్మార్ట్‌ఫోన్. వెనుకవైపు 13 మెగా పిక్సెల్స్ కెమెరా ఉంటుంది.

విశేషమేమిటంటే ఇది అందరికీ అందుబాటు ధరలో లభించనుంది. ‘మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా అండ్ మేడ్ బై ఇండియన్స్’ నానుడితో జియోఫోన్ నెక్ట్స్ ను విడుదలచేయబోతున్నారు. ప్రాంతీయ భాషలు మాట్లాడే వారితో అనుసంధానం అయ్యేందుకు అనువుగా ఈ స్మార్ట్‌ను రూపొందిస్తున్నారు. అంటే భాషా అనువాద ఫీచర్ కలిగి ఉంటుంది. దీనితో అవతలి వ్యక్తి ప్రాంతీయ భాషలో చెప్పే సందేశం ఇవతలి వారికి వారి భాషలోనే వినే అవకాశం కలుగుతుంది. మొత్తం 10 భాషలను అనువాదం చేయగల సామర్థం దీనికి ఉంది. అంతేకాక స్క్రీన్ మీద తెరుచుకునే ఏ యాప్ సమాచారంనయినా ఇది చదివి వినిపించగలదు. రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్‌కు చెందిన తిరుపతి, శ్రీపెరంబుదూర్‌లోని నియోలింక్ యూనిట్‌లో ఈ ఫోన్ తయారవుతోంది. దీపావళి కంటే ముందే రిలయన్స్ జియో విడుదల చేసిన ‘మేకింగ్ ఆఫ్ జియోఫోన్ నెక్ట్స్’ అనే వీడియోలో ఈ సరికొత్త వివరాలు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News