Wednesday, April 9, 2025

హైదరాబాద్, బెంగళూరులో జియో ట్రూ 5జి సేవలు షురూ..

- Advertisement -
- Advertisement -
జిబిపిఎస్ ప్లస్ వేగంతో అపరిమిత 5జి డేటా ఆఫర్

న్యూఢిల్లీ : దక్షిణాదిలో ముఖ్య నగరాలు హైదరాబాద్, బెంగళూరులో జియో ట్రూ 5జి సేవలను ప్రారంభించామని రిలయన్స్ జియో ప్రకటించింది. ‘జియో వెల్‌కమ్ ఆఫర్’లో భాగంగా వినియోగదారులకు 1జిబిపిఎస్ ప్లస్ వేగంతో అపరిమిత 5జి డేటాను అందివ్వనున్నట్టు కంపెనీ తెలిపింది. దీనికి అదనంగా ఎలాంటి చార్జీలు చె ల్లించాల్సిన అవసరం లేదని కూడా జియో ప్రకటించిం ది. గతంలో తొలిసారిగా జియో 5జి సేవలను ఆరు నగరాలు ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, వారణాసి, నాత్‌ద్వారాలో కంపెనీ ప్రారంభించింది.

అయితే దశల వా రీగా జియో తన 5జి సేవలను ప్రారంభిస్తోంది. వినియోగదారులకు అద్భుతమైన అనుభవాన్ని అందించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోందని జియో తెలిపింది. ఇప్పటికే ఆరు నగరాల్లో లక్షలాది మంది వినియోగదారులు 5జి సేవలను చూశారని, వారు సేవల పట్ల సానుకూలంగా స్పందించారని కంపెనీ తెలిపింది. వినియోగదారుల నుంచి వచ్చిన అభిప్రాయం ప్రకారం, ఎక్కడైనా త మ స్మార్ట్‌ఫోన్లలో 500 ఎంబిపిఎస్ నుంచి 1 జిబిపిఎస్ మధ్య వేగాన్ని చూస్తున్నామని, అధిక నాణ్యతతో కూడి న డాటాను పొందుతున్నామని కస్టమర్లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News