Sunday, September 8, 2024

హాలీవుడ్ కంటెంట్ ను అందిస్తున్న జియో సినిమా

- Advertisement -
- Advertisement -

అద్భుతమైన అంతర్జాతీయ కంటెంట్ ను భారతీయ ప్రేక్షకులకు అందిస్తూ మరెవ్వరికి సాధ్యం కాని రీతిలో దూసుకుపోతోంది జియో సినిమా. ఎంటర్ టైన్ మెంట్ అనుభవాన్ని మరో మరో స్థాయికి తీసుకెళ్లిన జియో సినిమా ఇప్పుడు అంతర్జాతీయ కంటెంట్ లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టైన బ్లాక్ బస్టర్ సినిమాలు,విమర్శకుల ప్రశంసలు పొందిన వెబ్ సిరీస్ లను అందిస్తుంది. హెచ్.బి.ఓ, పీకాక్ హబ్ లాంటి గ్లోబల్ నెట్ వర్క్ నుంచి ప్రీమియం కంటెంట్ ను జియో సినిమా అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన గేమ్ ఆఫ్ త్రోన్స్, హౌస్ ఆఫ్ ద డ్రాగన్ ఎస్1, సక్సెషన్, ఓపెన్ హైమర్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7, బార్బీ, లాస్ట్ ఆఫ్ అజ్ లాంటి అద్భుతమైన సిరీస్ లు హాలీవుడ్ కంటెంట్ లో భాగంగా ఉన్నాయి.

అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 2 జియో సినిమాలో జూన్ 17 నుంచి అందుబాటులో ఉండనుంది. వారానికో ఎపిసోడ్ చొప్పున ప్రతీ సోమవారం ఒక కొత్త ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. ఈ సిరీస్ జియో సినిమాలో యాడ్ ఫ్రీ కంటెంట్ గా అందుబాటులో ఉండడంతో పాటు.. ప్రాంతీయ భాషలైన హిందీ, మరాఠి, తమిళ్, తెలుగు, కన్నడ, బెంగాళీ భాషల్లో ప్రేక్షకుల కోసం సిద్ధంగా ఉండనుంది.

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి పొందిన అంతర్జాతీయ కంటెంట్ మొత్తాన్ని ఒకే వేదికపైకి తీసుకుని నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తోంది జియో సినిమా. హాలీవుడ్ కంటెంట్ తో పాటు కిడ్స్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్, ప్రతీ జోనర్ లో ఉండే ఒరిజినల్స్, బ్లాక్ బస్టర్ సినిమాలు, ఎక్స్ క్లూజివ్ గా టీవీ కంటే ముందే వచ్చే ప్రీమియర్స్, లైవ్ ఛానెల్స్ అన్నీ ఇప్పుడు జియో సినిమాలో సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా 4కే క్వాలిటీలో. ఈ నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ కేవలం నెలకు రూ.29 మాత్రమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News