Wednesday, January 22, 2025

ఈ నెల 8 నుంచి జియోమార్ట్ ‘జియోఉత్సవ్’ వేడుకలు షురూ

- Advertisement -
- Advertisement -

ముంబై : భారతదేశంలో అగ్రగామి మార్కెట్ స్థలాలలో ఒకటి అయిన జియోమార్ట్ పండుగ సీజన్‌కు ‘జియో ఉత్సవ్’ వేడుకలను ప్రకటించింది. ఈ వార్షిక పండుగ సేల్ -జియోఉత్సవ్ అక్టోబరు 8 నుండి ప్రారంభమవుతుంది. జియోమార్ట్ వినియోగదారులు అన్ని విభాగాల్లో 50 శాతం నుండి 80 శాతం వరకు డిస్కౌంట్లను అందుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్‌పై 70 శాతం వరకు మినహాయింపు పొందవచ్చు, ఈ విభాగములో వినియోగదారులు 48 గంటలలోపల ఉచిత ఇన్‌స్ట్టాలేషన్, స్మార్ట్‌ఫోన్స్‌పై రూ. 15,000 వరకు ఎక్స్‌చేంజ్ ప్రయోజనాలను అందుకోవచ్చు.

వినియోగదారులు జియోఉత్సవ్ – ఇండియా సేల్ వేడుకలలో భాగంగా ఎదురులేని డీల్స్ అందుకోవచ్చు. గృహోపకరణాలు, స్మార్ట్ టీవీలు, సౌండ్ బార్స్, మరెన్నో వస్తువులపై 70% మినహాయింపు, కొన్ని అద్భుతమైన డీల్స్ తోపాటు స్మార్ట్‌ఫోన్స్, యాక్సెసరీలపై 80% మినహాయింపును ఇస్తోంది. వీటికితోడు జియోమార్ట్ 48 గంటలలోపు ఉచిత ఇన్‌స్ట్టాలేషన్, 12 నెలల వరకు నో కాస్ట్ ఇఎంఐలు, ఉచిత డెలివరీని కూడా అందిస్తుంది. వినియోగదారులు స్మార్ట్‌ఫోన్స్‌పై రూ.15,000 వరకు ఎక్స్‌చేంజ్ ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News