Friday, November 22, 2024

కొత్త డిజిపి జితేందర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: నార్కోటిక్స్, సైబర్ క్రై మ్‌పై ఎక్కువ ఫోకస్ పెడతామని నూతన డిజిపి జితేందర్ స్పష్టం చేశారు. బుధవారం డిజిపి కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందే ఆ యనను డిజిపిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు లు జారీ చేసింది. వెంటనే ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జితేందర్‌కు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా జితేందర్ మాట్లాడుతూ డిజిపిగా అవకా శం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం నియమించిన తొలి డిజిపిగా జితేందర్ రి కార్డ్ నమోదు చేసుకున్నారు. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌కు చెందిన జితేందర్ 1992 కేడర్ ఐపిఎస్ ఆఫీసర్. తొలుత ఎపి కేడర్‌లో పని చేసిన ఆయన రాష్ట్ర విభజన అనంతరం తెలం గాణకు అలాట్ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మల్, బెల్లంపల్లి ఎఎస్‌పిగా పనిచేసిన జితేందర్, మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాల ఎస్‌పి గానూ పని చేశారు. అనంతరం డిప్యూటేషన్‌పై కేంద్ర సర్వీసులోకి వెళ్లిన ఆయన సిబిఐ, గ్రేహౌండ్స్‌లో వివిధ హోదాల్లో వర్క్ చేశారు. అనంత రం డిఐజిగా ప్ర మోషన్ పొంది విశాఖపట్నం

రేంజ్, వరంగల్ డిఐజిగా పనిచేశా రు. తర్వా త సిఐడి, విజిలెన్స్‌లో వర్క్ చేయడంతో పాటు హై దరాబాద్ ట్రాఫి క్ అదనపు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ అదనపు డిజిగా, జైళ్ల శాఖ డిజిగా పనిచేసిన జితేందర్ ప్రస్తుతం డీజీపీ హోదాలో హోం శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు విజిలె న్స్ అండ్ ఎన్‌ఫో ర్స్‌మెంట్ డిజి అదనపు బాధ్యతలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం తాజాగా ఆయనను డిజిపిగా నియమించింది. కాగా జితేందర్ 2025 సెప్టెంబరులో పదవీవిరమణ చేయనున్నారు. దీంతో జితేందర్ 14 నెలలపాటు డిజిపి పదవిలో కొనసాగనున్నా రు. అం తకు ముందు సిఎంరేవంత్‌రెడ్డిని నూ తన డిజిపి జితేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం డిజిపిగా ఉన్న ర వి గుప్తాను హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ అ య్యాయి. ఎన్నికల సమ యంలో డిజిపిగా ఉ న్న అంజనీకుమార్ ఫలితాలు వెలువడక ముం దే రేవంత్ రెడ్డిని కలవడంతో ఇసి ఆగ్రహించి బదిలీ చేసింది.ఆ స్థానంలో రవి గు ప్తాను నియమించింది. ఎన్నికల ఫలితాల తర్వాత రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత డిజిపిగా రవి గుప్తానే కొనసాగించాలని నిర్ణ యించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News