Sunday, December 22, 2024

చెరువును మింగిన బిజెపి నాయకుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ బిజెపి నాయకుడు చెరువును మింగేశాడు. బండ్లగూడ సమీపంలోని తట్టి అన్నారంలో జిట్టా బాలకృష్ణ రెడ్డికి చెందిన జే కన్వెన్షన్ సెంటర్ ఉంది. దానికి పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో జే కన్వెన్షన్ యాజమాన్యం పక్కనే 10 ఎకరాల్లో ఉన్న కుంటను కబ్జా చేసి మట్టితో పూడ్చి పార్కింగ్ కోసం వాడుకుంటున్నారు. వ్యవసాయానికి ఉపయోగపడే కుంటను కబ్జా చేయడంతో తట్టి అన్నారం రైతులు మే 24న రంగారెడ్డి జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించి సర్వే చేసిన ప్రభుత్వ అధికారులు ఆక్రమణలు తొలగించి కుంటలో పోసిన మట్టిని తొలగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News