Sunday, December 22, 2024

ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన జిట్టా బాలకృష్ణారెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల బిజెపికి రాజీనామా చేసిన కీలక నేత జిట్టా బాలకృష్ణారెడ్డి,  పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని శుక్రవారం కలిశారు. శుక్రవారం యాదాద్రి డిసిసి అధ్యక్షుడు సంజీవరెడ్డితో పాటు మర్యాదపూర్వకంగా కోమటిరెడ్డితో భేటీ అయ్యారు. కొన్ని రోజులుగా ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతున్న వేళ ఆయన కోమటిరెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతే కాదు రెండు రోజుల క్రితం టిపిసిసి చీఫ్ రేవంత్‌నూ భేటీ అయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరిక దాదాపు ఖాయం అయినట్లు తెలుస్తోంది. జిట్టా సొంత నియోజక వర్గం భువనగిరి అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ టికెట్లపై భరోసా లభించిన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం. ఈనెల 17వ తేదీన తుక్కుగూడలో జరిగే సోనియాగాంధీ బహిరంగ సభ సందర్భంగా కాంగ్రెస్లో అధికారికంగా చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News