Tuesday, September 17, 2024

జిట్టా బాలకృష్ణారెడ్డి అకాల మరణం దిగ్భ్రాంతి కలిగించింది

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి (52) అనారోగ్యంతో హైదరాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆయన కొద్ది రోజులుగా యశోదా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. వెంటిలేటర్‌పై ఉన్న జిట్టా, ఆరోగ్యం విషమించడంతో శుక్రవారం కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఉద్యమ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అకాల మరణం తనకు దిగ్భ్రాంతి కలిగించిందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బాలకృష్ణారెడ్డి తనకు మిత్రుడని, సన్నిహితుడని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

యువతను ఐక్యం చేసి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారని సిఎం రేవంత్ కొనియాడారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉద్యమ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అని సిఎం అభిప్రాయపడ్డారు. అకాల మరణం చెందిన జిట్టా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు సిఎం పేర్కొన్నారు. అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని సిఎం తెలియజేశారు. భువనగిరి శివారు మగ్గంపల్లి రోడ్డులోని ఆయన ఫాంహౌస్‌లో సాయంత్రం జిట్టా అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన అంత్యక్రియలకు మంత్రి కోమటిరెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News