Sunday, December 22, 2024

మధ్యప్రదేశ్‌కు కొత్త పిసిసి అధ్యక్షుడి నియామకం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతల నుంచి మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు కాంగ్రెస్ అధిష్టానం శనివారం ఉద్వాసన పలికింది. ఆయన స్థానంలో జీతూ పట్వారీని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ నియమించింది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడగా జీతూ శర్మను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నియమించినట్లు కాంగ్రెస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. తక్షణమే ఇది అమలులోకి వస్తుందని తెలిపింది. పదవి నుంచి తప్పుకుంటున్న పిసిసి అధ్యక్షుడు కమల్ నాథ్ సేవలను పార్టీ అభినందిస్తున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. భారీ విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆశించిన కాంగ్రెస్ అధిష్టానానికి అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రనిరాశ ఎదురైంది. బిజెపి క్లీన్ స్వీప్ చేయడం కాంగ్రెస్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News