Thursday, December 19, 2024

టీచర్ల పదోన్నతులు, బదిలీల పై జీవో విడుదల

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో శుక్ర‌వారం నుంచి టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను ప్రారంభిస్తున్నారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో నంబ‌ర్ 5ను గురువారం జారీ చేశారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు, మాన్యువల్‌గా పదోన్నతులు జరగనున్నాయి. రే28 నుంచి 30 వరకు బదిలీల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.

దరఖాస్తుల హార్డ్‌ కాపీలను ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత టీచర్లు సంబంధిత ఎమ్​ఈవోలకు మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డీఈవోకు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2లోపు సమర్పించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News