Friday, November 15, 2024

సింగిల్ డోస్ టీకాకు అనుమతి కోరిన జాన్సన్ అండ్ జాన్సన్

- Advertisement -
- Advertisement -

J&J applies for approval of its single dose

న్యూఢిల్లీ: కొవిడ్19 సింగిల్ డోస్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి భారత్‌లో అనుమతి కోరుతూ అమెరికా ఔషధ కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ దరఖాస్తు చేసింది. తమ వ్యాక్సిన్‌ను భారత్‌లో ప్రవేశపెట్టడానికి ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని సోమవారమే ఆ కంపెనీ తెలిపింది. గురువారం దరఖాస్తు ఇచ్చినట్టు ఆ కంపెనీ ప్రతినిధి శుక్రవారం వెల్లడించారు. తమ వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయడంలో హైదరాబాద్‌లోని బయొలాజికల్ ఇ లిమిటెడ్‌ది కీలక పాత్ర అని ఆ కంపెనీ పేర్కొన్నది. ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్‌లో తమ వ్యాక్సిన్ 85 శాతం సమర్థత చూపినట్టు జాన్సన్ కంపెనీ యూరోపియన్ యూనియన్ ఔషధ నియంత్రణ సంస్థకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ను అమెరికా, యూరప్ దేశాల్లో వినియోగిస్తున్నారు.

J&J applies for approval of its single dose

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News