Monday, April 28, 2025

జమ్మూకశ్మీర్‌లో మరో ముగ్గురు ఉగ్రవాదుల ఇళ్లు ధ్వంసం

- Advertisement -
- Advertisement -

జమ్మూకశ్మీర్‌లోని బండిపోరా, పుల్వామా, ఫోపియన్ జిల్లాల్లో ముగ్గరు క్రియాశీలక ఉగ్రవాదుల ఇళ్లను అధికారులు ధ్వంసం చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భద్రతా దళాలు ఉగ్రవాద వ్యవస్థపై అణచివేతను కొనసాగిస్తున్నాయని అధికారులు ఆదివారం తెలిపారు. గత సంవత్సరం ఉగ్రవాద సంస్థలో చేరిన అద్నాన్ షఫీ ఇంటిని శనివారం రాత్రి షోపియన్ జిల్లాలోని వాండిన్హాలో కూల్చివేసినట్లు వారు తెలిపారు. పుల్వామా జిల్లాలో మరో క్రియాశీల ఉగ్రవాది అమీర్ నజీర్ ఇంటిని క ఊడా కూల్చివేసినట్లు వారు తెలిపారు. బండిపోరా జిల్లాలో లష్కరే తోయిబా తీవ్రవాది జమీల్ అహ్మద్ షెర్గోజీ ఇంటిని కూడా కూల్చివేశారు. షెర్గోర్జీ 2016 నుంచి క్రియాశీలక ఉగ్రవాదిగా ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News