Wednesday, January 22, 2025

జెకె బస్సు దాడిపై దర్యాప్తు ఎన్‌ఐఎకు అప్పగింత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల ఒక బస్సుపై ఉగ్రవాదులు జరిపిన దాడిపై దర్యాప్తు బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)కు కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ సోమవారం అప్పగించింది. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ నుంచి యాత్రికులతో వెళుతున్న ఒక బస్సుపై ఉగ్రవాదులు ఈ నెల 9న జమ్మూ కాశ్మీర్ రియాసి జిల్లాలో దాడి జరపడంతో బస్సు ఒకలోతైన లోయలో పడిపోగా ముగ్గురు మహిళలతో సహా తొమ్మిది మంది వ్యక్తులు మరణించారు. 41 మంది గాయపడ్డారు. 53 సీట్ల బస్సు శివ్ ఖోరి నుంచి కాత్రాలో మాతా వైష్ణో దేవి ఆలయానికి వెళుతుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

జమ్మూ కాశ్మీర్‌లో ఒక బస్సుపై ఈ నెల 9 నాటి ఉగ్ర వాడిపై దర్యాప్తును ఎన్‌ఐఎకు అప్పగించినట్లు అధికారి ఒకరు తెలిపారు. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్‌లో భద్రత పరిస్థితిని, వార్షిక అమర్‌నాథ్ యాత్రకు సన్నాహాలను ఢిల్లీలో రెండు వరుస సమావేశాల్లో సమీక్షించిన మరునాడు ఈ నిర్ణయం వచ్చింది. రియాసి జిల్లాలో బస్సుపై ఉగ్ర దాడి, కేంద్ర పాలిత ప్రాంతంలో కొన్ని ఇతర ఉగ్ర ఘటనల నేపథ్యంలో ఢిల్లీలో ఆ సమీక్ష సమావేశాలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News