- Advertisement -
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లో ముగ్గురు ప్రభుత్వోద్యోగులను ఉగ్రవాద సంబంధాలున్నాయనే అభియోగాలపై బర్తరఫ్ చేశారు. ఈ వేటుకు గురయిన వారిలో కశ్మీర్ యూనివర్శిటీ కెమిస్ట్రీ ప్రొఫెసర్ మహమ్మద్ మక్బూల్ హజామ్, టీచరు గులాం రసూల్ కూడా ఉన్నారు. బర్తరఫ్‌కు గురైన వారిలో ఓ పోలీసు కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు ఎఎంఐ వార్తాసంస్థ అధికార వర్గాలను ఉటంకిస్తూ శుక్రవారం తెలిపింది. ఉగ్రవాద సంబంధాలున్నందున వారిపై రాజ్యాంగంలోని 344(2) సి అధికరణ పరిధిలో చర్యలు తీసుకున్నారు. గత ఏడాది మే నుంచి చూస్తే ఉగ్రవాద లింక్‌ల కారణంగా ప్రభుత్వం దాదాపు 40 మంది ప్రభుత్వోద్యోగులను సర్వీసుల నుంచి తీసివేసింది.
- Advertisement -