Wednesday, January 22, 2025

ఎల్‌ఓసి వద్ద ఐదుగురు లష్కరే ఉగ్రవాదులు హతం

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: కుప్వారా జిల్లాలోని వాస్వాధీన రేఖ మీదుగా దేశంలోకి చొరబడేందుకు యత్నించిన ఐదుగురు లష్కరే ఆయిబా గ్రవాదులను భారత భద్రతా దళాలు గురువారం హతమార్చాయి. అదేవిధంగా జమ్మూలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైనికులు జరిపిన కవ్వింపు కాల్పులను భారత బలగాలు మసర్థంగా తిప్పికొట్టాయని అధికారులు తెలిపారు.

అర్నియా, ఆర్‌ఎస్ పురా సెక్టార్లలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న ఐదు భారత సైనిక పోస్టులపై పాకిస్తానీ దళాలు బుధవారం రాత్రి కాల్పులకు పాల్పడగా ఒక బిఎస్‌ఎఫ్ జవానుతోపాటు నలుగురు పౌరులు గాయపడ్డారని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఉప్వారాకు చెందిన మచ్చిల్ సెక్టార్‌లోని ఎల్‌ఓసి వవద్ద పోలీసులు, సైన్యం సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టిన కొద్ది గంటలకే పాకిస్తానీ దళాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి.

రాత్రి 8 గంటల ప్రాంతంలో భారతీయ పోస్టులపై ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండానే పాకిస్తానీ దళాలు కాల్పులు జరిపినట్లు సీనియర్ బిఎస్‌ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. గాయపడిన జజవాన్‌ను ప్రత్యేక చికిత్స నిమిత్తం జమ్మూలోని జిఎంసి ఆసుపత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు. భారత సైనిక పోస్టుల వద్ద కాల్పుల పోరు కొననసాగుతోందని ఆయన చెప్పారు. సీనియర్ బిఎస్‌ఎఫ్ అధికారులకు ఆయా పోస్టుల వద్దకు చేరుకుంపటన్నట్లు ఆయన చెప్పారు.

కాగా..పాకిస్తానీ రేంజర్లు సరిహద్దులోని పౌర నివాసాలపై కూడా మోర్టార్ షెల్స్ కాల్చినట్లు వర్గాలు తెలిపాయి. అర్నియా, సుచ్‌గఢ్, జబోవల్, త్రేవాతో సహా కొన్ని ప్రాంతాలపై పాకిస్తానీ దళాలు కాల్పులు జరిపినట్లు వారు చెప్పారు.

మఛిల్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ మీదుగా భారత భూభాగంలోకి చొరబాటుకు ప్రయత్నించిన లష్కరే తాయిబా గ్రవాదులు ఐదుగురిని భారత భద్రతా దళాలు మట్టుపెట్టాయని అధికారి తెలిపారు. వారి నుంచి ఐదు ఎకె రైఫిల్స్‌తోసహా భారీ ఎతత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News