Saturday, December 21, 2024

రిటైల్‌ కార్యక్రమాలను విస్తరించిన జెకె టైర్‌..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: భారతీయ టైర్‌ పరిశ్రమ అగ్రగామి, రేడియల్‌ టైర్‌ విభాగంలో సుప్రసిద్ధమైన, జెకె టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ తమ మూడవ బ్రాండ్‌ షాప్‌ను తెలంగాణలో ప్రారంభించింది. ఈ బ్రాండ్‌ షాప్‌ను జెకె టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, హెడ్‌– మొబిలిటీ సొల్యూషన్స్‌ అండ్‌ ఫ్లీట్‌ మేనేజ్‌మెంట్‌ సంజీవ్‌ శర్మ, కంపెనీ ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రారంభించారు.

ఈ షాప్‌ ప్రారంభంతో జెకె టైర్‌ నెట్‌వర్క్‌ దక్షిణ భారతదేశంలో 32 ఔట్‌లెట్లు కావడంతో పాటుగా దేశంలో వీటి సంఖ్య 77కు చేరింది. తెలంగాణలో ఈ షాప్‌ ప్రారంభం, దేశవ్యాప్తంగా, తెలంగాణలో రిటైల్‌ కార్యకలాపాలను విస్తరించాలన్న లక్ష్యంలో భాగం. వ్యూహాత్మకంగా హైదరాబాద్‌ –ముంబై హైవే వద్ద దాదాపు 6000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రారంభించిన ఈ సదుపాయంలో ట్రక్‌ మరియు బస్సు వినియోగదారులకు సమగ్రమైన సేవలు లభిస్తాయి. ఈ అత్యాధునిక సదుపాయంలో సుశిక్షతులైన టెక్నికల్‌ ఎడ్వైజర్లు, వీల్‌ సర్వీసింగ్‌ ఎక్విప్‌మెంట్‌, పూర్తి శ్రేణి స్మార్ట్‌ టైర్స్‌ ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News