Friday, January 10, 2025

ఆంధ్రప్రదేశ్‌లో తమ వాణిజ్య నెట్‌వర్క్‌ను విస్తరించిన జెకె టైర్‌..

- Advertisement -
- Advertisement -

నెల్లూరు: భారతీయ టైర్‌ పరిశ్రమలో అతి పెద్ద సంస్థలలో ఒకటి కావడంతో పాటుగా ట్రక్‌ బస్‌ రేడియల్‌ విభాగంలో మార్కెట్‌ అగ్రగామిగా వెలుగొందుతున్న జెకె టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ నేడు తమ నూతన జెకె టైర్‌ ట్రక్‌ వీల్‌ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు వద్ద ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌లో అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ప్రతిష్టాత్మక కేంద్రాన్ని అత్యుత్తమ శ్రేణిలో వినియోగదారుల కు పరిష్కారాలను అందించే రీతిలో తీర్చిదిద్దారు. తద్వారా దక్షిణ భారతదేశంలో తమ ట్రక్‌ వీల్‌ కేంద్రాల నెట్‌వర్క్‌ను 29 కేంద్రాలకు చేర్చింది.

జెకె టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ శ్రీ సంజీవ్‌ శర్మ ఈ నూతన ట్రక్‌ వీల్‌ కేంద్రాన్ని సీనియర్‌ అధికారుల సమక్షంలో ప్రారంభించారు. ఈ ఏకీకృత ట్రక్‌ వీల్‌ కేంద్రం–అరుణ టైర్స్‌, ఆంధ్రప్రదేశ్‌లో నాల్గవ కేంద్రం కాగా, దేశంలో 71వ కేంద్రం. విస్తారమైన రీతిలో 6500 చదరపు అడుగుల ప్రాంగణంలో వ్యూహాత్మకంగా ఎన్‌హెచ్‌–16, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్‌ వద్ద ఇది ఉంది. ఇది వినియోగదారులకు అత్యంత సౌకర్యవంతమైన ప్రాంగణంలో ఉండటంతో పాటుగా ట్రక్‌ మరియు బస్‌ టైర్‌ కేర్‌ కోసం సమగ్రమైన పరిష్కారాలను అందిస్తుంది. ఈ అత్యాధునిక కేంద్రంలో సాంకేతికంగా అత్యున్నత ప్రతిభ కలిగిన సలహాదారులు, వీల్‌ సర్వీసింగ్‌ ఎక్విప్‌మెంట్‌, ట్రక్‌/బస్‌ కోసం పూర్తి శ్రేణి స్మార్ట్‌ టైర్లు మరియు తమ ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్ల కోసం జెకె టైర్‌ యొక్క రిటైల్‌ గుర్తింపును వెల్లడిస్తూ ఎక్స్‌పీరియన్స్‌ జోన్‌ ఉన్నాయి.

జెకె టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ శ్రీ శ్రీనివాసు అల్లాఫన్‌ మాట్లాడుతూ.. ‘‘నెల్లూరులోని ఈ నూతన ట్రక్‌ వీల్స్‌ కేంద్రం, సాటిలేని ఒన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ సర్వీస్‌ అనే తమ జెకె టైర్‌ యొక్క వినియోగదారుల కేంద్రీకృత విధానం నొక్కి చెబుతుంది. అధికారులు నిర్ధేశించిన అన్ని భద్రతా మార్గదర్శకాలనూ అమలు చేస్తున్న ఈ కేంద్రం, వినియోగదారుల టైర్‌ అవసరాలను తీర్చడంతో పాటుగా అదనపు విలువ మరియు సౌలభ్యాన్ని సైతం అందిస్తుంది’’ అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఈ కేంద్రాన్ని, ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా దేశవ్యాప్తంగా తమ వాణిజ్య కార్యకలాపాలను విసరించాలన్న కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా ఏర్పాటుచేశారు. జెకె టైర్‌కు దేశవ్యాప్తంగా విస్తృత స్ధాయిలో 150కు పైగా ఔట్‌లెట్లతో కూడిన ట్రక్‌/బస్‌ టైర్‌ సర్వీస్‌ నెట్‌వర్క్‌ ఉంది. ఇది అత్యుత్తమ శ్రేణిలో సేవలను అత్యున్నత నాణ్యత కలిగిన యంత్రసామాగ్రితో అందిస్తుంది. దీనిలో కంప్యూటరైజ్డ్‌ వీల్‌ ఎలైన్‌మెంట్‌, టైర్‌ రొటేషన్‌, నైట్రోజన్‌ ఇన్‌ఫ్లేషన్‌, టైర్‌ ఇన్‌ఫ్లేషన్‌ వంటివన్నీ ఒకే చోట లభించడంతో పాటుగా వినియోగదారులకు సంపూర్ణమైన అనుభవాలను అందిస్తారు.

వినియోగదారులకు సురక్షిత వాతావరణాన్ని అందిస్తూ ఈ నూతన షోరూమ్‌లో పలు భద్రతా చర్యలను తీసుకోవడంతో పాటుగా వారి రక్షణ కోసం నాన్‌ కాంటాక్ట్‌లెస్‌ సేవలు, డిజిటల్‌ చెల్లింపులు, అన్ని భద్రతా చర్యలతో సుశిక్షితులైన టెక్నీషియన్లు, ట్రక్‌ శానిటైజేషన్‌ మొదలైనవి అందుబాటులో ఉంచారు. తద్వారా సందర్శకుల భద్రతకూ భరోసా అందిస్తున్నారు. జెకె టైర్‌, వినియోగదారుల భద్రతకు భరోసా అందిస్తూ ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా తమ రిటైల్‌ నెట్‌వర్క్‌వ్యాప్తంగా భద్రతా మార్గదర్శకాలను అమలు చేస్తుంది.

JK Tyre Expands Trade Network in Nellore

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News