Monday, January 20, 2025

జెఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలి.. టిఎస్‌పిఎస్‌సికి హైకోర్టు ఆదేశాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : జూనియర్ లెక్చరర్ పరీక్ష ప్రశ్నపత్రాన్ని ఇంగ్లీష్‌లోనే ఇవ్వాలన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పేపర్ -2 ప్రశ్నపత్రం తెలుగులోనూ ఇవ్వాలని టిఎస్‌పిఎస్‌సిని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ నిమిత్తం గతేడాది డిసెంబరు 9న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించే పరీక్షలకు ప్రశ్నపత్రాలను ఆంగ్లంలోనే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆదిలాబాద్‌కు చెందిన టి.విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం. ఇష్టానుసారంగా పరీక్షలు నిర్వహించడం సరికాదని వ్యాఖ్యానించింది. జేఎల్ పేపర్ -2 ప్రశ్నపత్రం ఇంగ్లీష్, తెలుగులో ఇవ్వాలని టిఎస్‌పిఎస్‌సిని హైకోర్టు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News