Friday, January 10, 2025

జె.ఎల్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఎంపిక అభ్యర్థుల జాబితాను టిజిపిఎస్‌సి ప్రకటించింది. ఇంటర్ విద్యాశాఖలో ఇప్పటికే పలు పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల తుది జాబితాను కమిషన్ విడుదల చేయగా, తాజాగా ఇంగ్లీష్, మ్యాథ్స్ అభ్యర్థుల తుది జాబితాను టీజీపీఎస్సీ వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఇతర వివరాలకు టిజిపిఎస్‌సి వెబ్‌సైట్ చూడాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News