Thursday, January 23, 2025

జెఎంఎం బ్లాక్ ప్రెసిడెంట్‌ను కాల్చి చంపిన ఆగంతకులు

- Advertisement -
- Advertisement -

Jim Black President Shot Dead

లతెహార్ : జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) బ్లాక్ ప్రెసిడెంట్ దిలేశ్వర్ ఖాన్‌ను గుర్తు తెలియని దుండగులు ఆదివారం కాల్చి చంపారు. లతెహార్ జిల్లాలోని కుసుమహి రైల్వేసైడింగ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. జెఎంఎం బాలూమాథ్ బ్లాక్ ప్రెసిడెంట్‌గా దిలేశ్వర్ ఖాన్ ఉన్నారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు రెండు మోటారు సైకిళ్లపై వచ్చి రైల్వే సైడింగ్ వద్ద ఖాన్‌పై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఖాన్‌ను లతెహార్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యం లోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. దుండగుల కోసం గాలిస్తున్నామని బాలూమాథ్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి అజిత్ కుమార్ తెలిపారు. ఈ హత్యకు నిరసన తెలియజేస్తూ గ్రామస్థులు రాంచీఛాత్ర రోడ్డును దిగ్బంధం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News