Monday, January 20, 2025

జార్ఖండ్లో రాజకీయ సంక్షోభం..

- Advertisement -
- Advertisement -

మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తిమోర్చా(జెఎంఎం) కార్యనిర్వాహక అధ్యక్షులు హేమంత్ సోరెన్‌ను ఇడి కస్టడిలోకి తీసుకోవడంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. జార్ఖండ్ లో కాంగ్రెస్, ఆర్జేడీ సపోర్టుతో జెఎంఎం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, అనూహ్యంగా హేమంత్ సోరెన్‌ కావడంతో ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు క్యాంప్ ఏర్పాటు చేశారు. జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాంచీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు తరలించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ హైకమండ్ అదేశాలతో సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఎఐసిసి పెద్దలు పలు సూచనలతో రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్యేల క్యాంపు కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

JMM MLAs Rushed to Hyderabad from Jharkhand

కాగా, మనీలాండరింగ్ కేసులో ఇడి విచారణ అనంతరం సీఎం పదవికి హేమంత్ సోరెన్‌ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపించారు. ఆ తర్వాత భారీ పోలీసు బందోబస్తు నడుమ ఆయనను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. దీంతో జెఎంఎం సీనియర్ నేత, రాష్ట్ర రవాణా మంత్రి చంపై సోరెన్‌ను శాసససభాపక్ష నేతగా ఎంపిక చేశారు. జార్ఖండ్ కొత్త సిఎంగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం కూలిపోకుండా అధికార పార్టీ..ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News