Friday, December 20, 2024

ప్రైవేట్ విమానాల్లో హైదరాబాద్‌కు జెఎంఎం ఎమ్మెల్యేలు!

- Advertisement -
- Advertisement -

బిజెపి ప్రలోభాల నుంచి తప్పించుకునే ప్రయత్నం
గవర్నర్ నుంచి ఆహ్వానం కోసం నిరీక్షణ

చాంచి: రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో బిజెపి పెట్టే ప్రలోభాల నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జార్ఖండ్‌లోని జెఎంఎం సారథ్యంలోని కూటమి వారిని హైదరాబాకు తరలించే అవకాశం ఉన్నట్లు జెఎంఎం వర్గాలు గురువారం వెల్లడించాయి. తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించేందుకు రెండు అద్దె విమానాలను బుక్ చేసినట్లు వారు చెప్పారు. ఒకటి 12 సీటర్ల విమానం కాగా మరొకటి 37 సీటర్ల విమానమని వర్గాలు తెలిపాయి.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రాజ్‌భవన్ నుంచి ఆహ్వానం రావడం ఆలస్యమైన పక్షంలో తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు బిజెపి చేసే ప్రయత్నాలను నివారించే ఉద్దేశంతో తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించాలని జెఎంఎం సారథ్యంలోని కూటమి యోచిస్తున్నట్లు తన పేరును వెల్లడించడానికి ఇష్టపడని ఒక ఎమ్మెల్యే తెలిపారు. 81 మంది సభ్యుల జార్ఖండ్ అసెంబ్లీలో తనకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ నుంచి ఆహ్వానం కోసం ఎదురుచూస్తున్నానని జార్ఖండ్ ముక్తి మోర్చ(జెఎంఎం) శాసనసభా పక్షం నాయకునిగా కొత్తగా ఎన్నికైన చంపై సోరెన్ తెలిపారు.

ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ రాజీనామా చేయడం, ఆయనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో జెఎంఎం శాసనసభా పక్ష నేతగా అధికార కూటమి చంపై సోరెన్‌ను ఎన్నుకుంది. నిద్ర మత్త నుంచి రాజ్‌భవన్ వెంటనే మేల్కొంటుందని ఆశిస్తున్నట్లు చంపై రాయ్ వ్యాఖ్యానించారు. మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను బుధవారం ఇడి అరెస్టు చేసింది. ఆయన స్థానంలో పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర రవాణా మంత్రి చంపై సోరెన్‌ను అధికార కూటమి ఎన్నుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News