Wednesday, December 25, 2024

జెఎన్-1 కరోనా కొత్త వేరియంట్… జర జాగ్రత్త

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కోవిడ్ విషయంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది. జెఎన్-1 వేరియంట్ వెలుగు చూడటంతో కేంద్రం అప్రమత్తమైంది. కొవిడ్ లక్షణాలు ఉంటే ఆర్‌టిపిసిఆర్ టెస్టులు చేయాలని ఆదేశించింది. పాజిటివ్ శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాలని ఆదేశించింది. అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించింది. భారత్ సహా 38 దేశాల్లో జెఎన్-1 వేరియంట్ ఉందని కేంద్రం పేర్కొంది. అధికారులు అప్రమత్తంగా ఉంటూ కొత్త కేసులపై నిఘా ఉంచాలని తెలిపింది. కేరళ లాంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. సంక్రాంతి పండుగతో పాటు రాష్ట్రాలలో ఫెస్టివల్ సీజన్ ఉండడంతో వైరస్ విజృంభించకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News