Monday, January 20, 2025

జెఎన్‌టియూలో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిల్డింగ్‌పై నుంచి దూకి ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూకట్‌పల్లిలోని జెఎన్‌టియూలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…ఎపిలోని నెల్యూరు జిల్లాకు చెందిన ఈసనాక మేఘనారెడ్డి హైదరాబాద్, కూకట్‌పల్లిలోని జెఎన్‌టియూలో సిఎస్‌ఈ నాలుగో సంవత్సరం చదువుతోంది. కాగా మేఘనారెడ్డి గత కొంత కాలం నుంచి మానసికంగా ఇబ్బందులు పడుతోంది. దీనిపై గతంలో వైద్యుల వద్ద చికిత్స తీసుకుంది.

ఈ క్రమంలోనే తన క్లాస్ రూమ్ మూడో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మేఘానారెడ్డి అనారోగ్య సమస్యల వల్లే ఆత్మహత్య చేకుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కెపిహెచ్‌బి పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News