- Advertisement -
హైదరాబాద్: కూకట్ పల్లిలోని జెఎన్ టియు యూనివర్సిటీలో జరిగిన మెగా జాబ్ మేళాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్లాస్ రూమ్ కాంప్లెక్స్ వద్ద ఇంటర్వ్యూ కోసం వచ్చిన నిరుద్యోగుల మధ్య తోపులాట జరిగింది. మెగా జాబ్ మేళా అని తెలియడంతో నిరుద్యోగ యువత భారీగా తరలివచ్చింది. నిపుణ సేవా ఇంటర్నేషనల్, జేఎన్టీయూ యూనివర్సిటీ అధికారులు కనీసం ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంతోనే తోపులాట జరిగింది. 5000కు పైగా నిరుద్యోగ యువత మెగా జాబ్ మేళాకు హాజరయ్యారు. మౌలిక వసతుల కల్పనలో నిపుణ, సేవా ఇంటర్నేషనల్ సంస్థలు విఫలమయ్యామని నిరుద్యోగ యువత మండిపడుతున్నారు.
- Advertisement -