Monday, January 20, 2025

జెఎన్‌యు కొత్త రూల్స్: ధర్నా చేసే రూ. 20 వేల ఫైన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యు) కొత్త నిబంధనల ప్రకారం క్యాంపస్‌లో హింసకు పాల్పడినా, ధర్నాలు, హింసకు పాల్పడితే రూ. 20 వేల వరకు జరిమానా లేదా అడ్మిషన్ రద్దు వంటి శిక్షలు ఉంటాయి. తోటి విద్యార్థి, సిబ్బంది లేదా ఫ్యాకల్టీ సభ్యులపై దౌర్జన్యానికి, భౌతిక దాడికి విద్యార్థులెవరైనా పాల్పడితే రూ.50 వేల వరకు జరిమానాను ఎదుర్కోవలసి వస్తుందని కొత్త నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. కాగా.. కొత్త నిబంధనలను యూనివర్సిటీ విద్యార్థులు, టీచర్లు ఖండిస్తున్నారు. ఇవి విద్యార్థుల హక్కులను హరించేవని వారు అభివర్ణిస్తున్నారు. వీటిని చర్చించేందుకు విద్యార్థి సంఘాలు గురువారం సమావేశమయాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News