న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జెఎన్‌యు)లోని ఒక హాస్టల్‌లో బాత్‌రూమ్ పైకప్పు కూలి ఒక విద్యార్థి గాయపడినుట్ల అధికారులు తెలిపారు. గురువారం ఉదయం సబర్మతి హాస్టల్‌లో ఈ సంఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థిని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఇది హాస్టల్ వార్డెన్లు, విద్యార్థులకు చెందిన డీన్ నిర్లక్ష ఫలితమని, శిథిలావస్తలో ఉన్న హాస్టల్ గదులు, బాత్‌రూమ్ పైకప్పుల గురించి ఇదివరకే అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, నిధుల కొరత పేరుతో ఈ సమస్యను జెఎన్‌యు పాలకులు నిర్లక్షం చేస్తూ వచ్చారని అఖిల భారత విద్యార్థుల సంఘం నేత మధురిమ కుందు ఆరోపించారు. బాత్‌రూమ్ పైకప్పులో కొంతభాగం విరిగిపడడంతో జర్మన్ భాషలలో బిఎ రెండవ సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థి గాయపడిన సంఘటన నిజమేనని జెఎన్‌యు సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరింఆరు. విద్యార్థికి స్వల్ప గాయాలయ్యాయని, హాస్టల్ వార్డెన్ ఆ విద్యార్థిని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తీసుకెళ్లారని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆ విద్యార్థి పరిస్థితి నిలకడగా ఉందని, ఎక్స్ రే తీయించగా అంతా బాగానే ఉన్నట్లు తేలిందని, సిటి స్కాన్ రిపోర్ట్ కోసం వేచి చేస్తున్నామని ఆ అధికారి చెప్పారు.
బాత్‌రూమ్ పైకప్పు కూలి జెఎన్‌యు విద్యార్థికి గాయాలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -