వామపక్ష ప్యానెల్ క్లీన్ స్వీప్
న్యూఢిల్లీ: మూడు దశాబ్దాల తర్వాత వామపక్ష గ్రూపులకు చెందిన తొలి దళిత విద్యార్థిని జవహర్‌లాల్ నెహ్రూఊ యూనివర్సిటీ విద్యార్థుల సంఘం(జెఎన్‌యుఎస్‌యు) ఎన్నుకుంది. ఆదివారం జరిగిన జెఎన్‌యుఎస్‌యు ఎన్నికలలో ఐక్య వాపక్ష ప్యానల్ క్లీన్ స్వీప్ చేసింది. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ ఎబివిపి ప్యానల్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. నాలుగే ళ్ల విరామం అనంతరం జరిగిన జెఎన్‌యుఎస్‌యు ఎన్నికలలోఅధ్యక్షుడిగా అఖిల భారత విద్యార్థుల సంఘం(ఎఐఎస్‌ఎ)కు చెందిన ధనంజయ్ గెలుపొందారు.
ధనంజయ్‌కు 2,598 ఓట్లు రాగా ఆయన సమీప ప్రత్యర్థి ఎబిపివికి చెందిన ఉయేష్ సి అజ్మీరాకు 1,676 ఓట్లు లభించాయి. బీహార్‌లోని గయకు చెందిన ధనంజయ్ దళిత వర్గానికి చెందిన విద్యార్థి. 199697 తర్వాత వామపక్షాల నుంచి ఒక దళిత విద్యార్థి జెఎన్‌యుఎస్‌యు అధ్యక్ష పదవికి ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. ఫలితాల వెల్లడి అనంతరం ధనంజయ్ విలేకరులతో మాట్లాడుతూ విద్వేష, హింసాత్మక రాజకీయాలను జెఎన్‌యు విద్యార్థులు తిరస్కరిస్తున్నారనడానికి ఇదే ఈ విజయమే నిదర్శనమని అన్నారు. విద్యార్థులు తమ పట్ల మరోసారి తమ నమ్మకాన్ని చూపారని, విద్యార్థుల హక్కులు, వారి సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని ధనంజయ్ తెలిపారు.
క్యాంప్‌లోని విద్యార్థినుల భద్రత, నిధుల కోత, స్కాలర్‌షిప్ పెంపు, మౌలిక సౌకర్యాలు, మంచినీటి కొరత వంటివి తమ ప్రథమ పాధాన్యతలని ఆయన తెలిపారు. లాల్ సలామ్, జై భీమ్ వంటి నినాదాల మధ్య ఎరుపు, తెలుపు, నీలం జెండాలను ప్రదర్శిస్తూ విద్యార్థులు విజయోత్సవాలు జరుపుకున్నారు. ఉపాధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో ఎస్‌ఎఫ్‌ఐకి చెందిన అవిజిత్ ఘోష్ ఎబివిపి అభ్యర్థి దీపికా శర్మను 927 ఓట్ల తేడాతో ఓడించారు. ప్రధాన కార్యదర్శిగా లెఫ్ట్ మద్దతుగల బిర్సా అంబేద్కర్ ఫూలే విద్యార్థుల సంఘం(బిఎపిఎస్‌ఎ) అభ్యర్థి ప్రియాంషి ఆర్య ఎబివిపి అభ్యర్థి అర్జున్ ఆనంద్‌ను 926 ఓట్ల తేడాతో ఓడించారు.