Saturday, December 21, 2024

విదేశాల్లో ఉపాధి.. ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో పని చేయుటకు నైపుణ్యం గల అభ్యర్థులు ఈ నెల 13 లోగా కరీంనగర్‌లోని బైపాస్ రోడ్డులోని ఉజ్వల పార్కు ఎదురుగాగల టాస్క్ రీజినల్ సెంటర్‌లోని ఐటీ టవర్స్‌లో టామ్ కామ్‌లో ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ పూర్తి డాటాను www.tomcom.telangana.gov.in, ఈ మెయిల్, hrm.tomcom.letf@telangana.gov.inద్వారా నమోదు చేసుకోవాలన్నారు. వీరి వద్ద రెండు సంవత్సరాల కనీస చెల్లుబాటు కలిగిన పాస్‌పోర్టు ఉండాలని, ఎంపికైన అభ్యర్థులకు భోజన, వసతి, చేరిక టికెట్‌లు అందించనున్నట్లు తెలిపారు.

ఆస్ట్రేలియాలో హెచ్‌డీ మెయింటెనెన్స్ టెక్నీషియన్స్, ఫిట్టర్, భారతీయరెస్టారెంట్‌లలో పని చేయడానికి చెఫ్‌లు, యూఏఈలో బ్లాస్టర్ పెయింటర్, క్లీనర్, ఫోర్‌మాన్ బ్లాస్టింగ్, పెయింటింగ్ ఫోర్ మాన్ ప్లేటర్, ఘాట్ వెల్డర్, ఐటీవీ డ్రైవర్, మెషినిస్ట్ సీఎన్‌సీ, పైప్ ఫిట్టర్, ప్లేటర్ ప్యాబ్రికేటర్, సెక్యూరిటీ సిస్టమ్స్ టెక్నీషియన్, సీనియర్ ఆఫీసర్ ఆపరేషన్స్‌లలో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. వీటిని టామ్ కామ్ ఏజెన్సీ ద్వారా అక్కడి సంస్థలతో ఒప్పందం మీద పంపిస్తారని వివరించారు. ఆసక్తి గల వారు మరిన్ని వివరాలకు టామ్‌కామ్ హెచ్‌ఆర్ మేనేజర్ 9100798204, 7893566493, 8328602231 నెంబర్‌లలో సంప్రదించాలని తిరుపతి రావు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News