Sunday, February 23, 2025

విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా జాబ్ క్యాలెండర్

- Advertisement -
- Advertisement -

ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భరోసా

మన తెలంగాణ / హైదరాబాద్ : రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్ కు అనుగుణంగా జాబ్ రిక్రూట్మెంట్ క్యాలెండర్ ను అమలు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. ఆదివారం ప్రజా భవన్ లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ నేతలు డిప్యూటీ సీఎం కలిసిన సందర్భంగా వారికి భరోసా ఇచ్చారు. రామగుండంలో 800 మెగావాట్ల నూతన విద్యుత్ కేంద్రాన్ని 100 శాతం జెన్‌కో ఆధ్వర్యంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల డిప్యూటీ సీఎంకు అసిస్టెంట్ ఇంజనీర్లు కృతజ్ఞతలు తెలిపారు.

జెన్‌కోలో అక్టోబర్ 2024 లో ఇచ్చిన ఎఇ నుంచి ఎడిఇ పదోన్నతులకు పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వాలని, టీజీ ట్రాన్స్‌కో, డిస్కం కంపెనీల్లో నియామకాలు పదోన్నతుల అంశాలను వారు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. అసిస్టెంట్ ఇంజనీర్ల విజ్ఞప్తికి డిప్యూటీ సీఎం స్పందిస్తూ ఇటీవల ఇచ్చిన పదోన్నతుల గురించి త్వరలో ఉత్తర్వులు వచ్చేలా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

విద్యుత్ ఉద్యోగులంతా తెలంగాణలో ప్రజలకు ఎటువంటి విద్యుత్ అంతరాయం కలగకుండా తీవ్రంగా శ్రమించాలని, విద్యుత్ సంస్థలో ఉద్యోగం సేవా భావనతో కూడినదని దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి బట్టు హరీష్, కార్యనిర్వాహక అధ్యక్షుడు షేక్ ఇమ్రాన్, ఏఈలు యాదగిరి, సమీర్, పిల్లి రాజు, అనిల్ రెడ్డి, నాగరాజు, అశోక్, మధు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News