Sunday, December 22, 2024

న్యూ జనరేషన్ కళాశాలలో జాబ్ మేళా

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: దేశంలో ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులైన ఐసీసీఐ, హెచ్‌డిఎఫ్‌సి, కోటాక్ మహింద్ర, టాటా ఎంఐఎలలో ట్రైమ్స్ ప్రో వారి సౌజన్యంతో సిద్దిపేట జిల్లా ఎంఈపీఎ వారి ఆధ్వర్యంలో 28 సంవత్సరలలోపు యువతీ యువకులు డిగ్రీ అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంఈపీఎ జిల్లా అద్యక్షుడు పిట్ల అంజనేయులు ముదిరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ నెల 28న ఉదయం 10 గంటలకు న్యూజనరేషన్ కళాశాలలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనే ధరఖాస్తు ఫారంతో పాటు రెజ్యూమ్, అర్హత గల జిరాక్స్ కాఫీలతో హాజరు కావాలన్నారు. డిగ్రీ పూర్తి చేసుకునే విద్యార్ధులు కూడా హాజరు కావచ్చన్నారు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రదాన కార్యదర్శులు నాయిని కృష్ణ, పులి దేవేందర్‌లు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు నాగరాజు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, నరేశ్, నర్సింలు, సతీష్, రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News