Wednesday, January 22, 2025

ఈ నెల 16న ఉస్మానియా యూనివర్శిటీలో జాబ్ మేళా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:  ఓయూలోని యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరోలో ఈ నెల 16న జాబ్ మేళా నిర్వ హించనున్నట్లు బ్యూరో డిప్యూటీ చీఫ్ టి.రాము ఒక ప్రకటనలో తెలిపారు. ధరణి ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం ఈ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మేళాకు హాజరయ్యేందుకు 10 తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అర్హత కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన స్త్రీ, పురుషులు ఎవరైనా మేళాకు హాజరుకావచ్చని వివరించారు. అభ్యర్థులు తమ బయోడేటా, సర్టిఫికెట్లతో మేళాకు హాజరుకావాలన్నారు. ఇతర వివరాలకు 7355469999 నెంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News