Sunday, February 2, 2025

25న సంగారెడ్డిలో జాబ్ మేళా

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి టౌన్: ఇడో బ్రిడ్జి కంపెనీలో ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వందన తెలిపారు. ఇడో బ్రిడ్జి కంపెనీలో 80ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఉద్యోగం చేయాలని ఆసక్తి ఉన్నవారు బికాం, బిఎస్‌సి, బిసిఎ, బిఈ, బిటెక్ ఎంఎస్‌సి, ఎంసిఎ విద్యార్హతలు గల అభ్యర్థులు అర్హులన్నారు. అభ్యర్థుల వయస్సు 20నుండి 25ఏళ్లలోపు వారై ఉండాలన్నారు. జీతం 12500ల నుండి 18వేల రుపాయల వరకు ఉంటుందన్నారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈ నె25న నిర్ణీత సమయంలోగా తమ విద్యార్హతల ధ్రువపత్రాలు పదవతరగతి మెమో, ఆధార్‌కార్డు, కుల ధృవీకరణ సర్టిఫికెట్‌లు, జిరాక్స్ ప్రతులతో నేరుగా సంగారెడ్డిలోని బైపాస్‌రోడ్డులోని వెలుగు కార్యాలయ ఆవరణలోని ఉపాధి కార్యాలయంలో ఇంటర్వూలు నిర్వహిస్తామన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్ 08455=271010లో సంప్రదించాలని శనివారం ఆమె ఒక ప్రకటనలో కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News