Sunday, December 22, 2024

గిరిజన నిరుద్యోగులకు ఈనెల 16న జాబ్ మేళా..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / భద్రాచలం : భద్రాచలం ఐటిడిఎ ఆధ్వర్యంలో ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లా పరిధిలో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బిఫార్మసీ, ఐటి, డిప్లొమా, బిటెక్ చదివి 18 ఏళ్లు నిండిన గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులు ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈనెల 16వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి పోట్రు గౌతమ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఆసక్తి గల నిరుద్యోగ యువత విద్యార్హత పత్రాలు, ఆధార్‌కార్డ్, కుల దృవీకరణ జిరాక్స్ సర్టిఫికేట్లతో ఆరోజు ఉదయం 9 గంటల వరకు భద్రాచలం ఐటిడిఎ ప్రాంగణ(హౌసింగ్ గెస్ట్ హౌస్ ప్రక్కన)లో గల యువజన శిక్షణా కేంద్రానికి ఇంటర్వ్యూకు హాజరు కావాలని ఆయన కోరారు. పూర్తి వివరాల కోసం ఫోన్ నెం 8143840906 కు సంప్రదించాలని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News