Wednesday, January 22, 2025

ఉపాధి కార్యాలయంలో నిరుద్యోగులకు జాబ్‌మేళా

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డిః నిరుద్యోగ యువతీ యువకులకు ముత్తూట్ పైనాన్స్‌లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఇంఛార్జీ ఉపాధి అధికారి వందన తెలిపారు. ముత్తూట్ ఫైన్సా కంపెనీలో 50కి పైగా ఫ్రొఫెషనరీ ఆఫీసర్‌లు, 100 జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం ఈ నెల19వ తేదీన ఉదయం 11గంటలకు సంగారెడ్డిలోని బైపాస్ రోడ్డులోని ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు.

అభ్యర్థుల వయస్సు 18 నుండి 28 సంవత్సరాల లోపు ఉండాలని ఫ్రొఫెషనరీ ఆఫీసర్లకు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జూనియర్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి గ్రాడ్యుయేట్ అర్హులని చెప్పారు. నెలకు జీతం 10వేల నుండి 16వేల వరకు ఉంటుందని చెప్పారు. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత సమయంలోగా హాజరు కావాలని ఆమె మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News